వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే - స్వాతికిరణం (1992)

వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే

చిత్రం : స్వాతికిరణం (1992)     సంగీతం : కె.వి. మహదేవన్   రచన :  సిరివెన్నెల    నేపధ్య గానం :   వాణీజయరాం

పల్లవి :

వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే.. వింధ్య విలాసిని  వారాహి త్రిపురాంబికే
వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే.. వింధ్య విలాసిని  వారాహి త్రిపురాంబికే
భవతి విధ్యాం దేహి.. భగవతి సర్వార్ధసాధికే.. సత్యాద్రచంద్రికే

మాంపాహీ మహనీయ మంత్రాత్మికే
మాంపాహి మాతంగి మాయాత్మికే
మాంపాహీ మహనీయ మంత్రాత్మికే
మాంపాహి మాతంగి మాయాత్మికే

చరణం 1 :

ఆపాత మధురము.. సంగీతము...
అంచిత సంగాతము.. సంచిత సంకేతము
ఆపాత మధురము.. సంగీతము...
అంచిత సంగాతము.. సంచిత సంకేతము

శ్రీ భారతీ క్షీర సంపాతము.. అమృత సంపాతము.. సుకృత సంపాకము
శ్రీ భారతీ క్షీర సంపాతము.. అమృత సంపాతము.. సుకృత సంపాకము

సరిగమస్వరధుని సారవరూధినీ.. సామసునాధ వినోదిని
సకల కళ కళ్యాణి సుహాసిని.. శ్రీ రాగాలయ వాసిని

మాం పాహీ మకరంద మందాకిని
మాం పాహీ సుజ్ణ్జాన సంవర్ధిని
వైష్ణవి.. భార్గవి.. వాగ్దేవి.. త్రిగుణాత్మికే..
వింధ్య విలాసిని...  వారాహి...  త్రిపురాంబికే

చరణం 2 :

ఆలోచనామృతము సాహిత్యమూ.. సహిత హిత సత్యము.. శారదా స్తన్యము
ఆలోచనామృతము సాహిత్యమూ.. సహిత హిత సత్యము.. శారదా స్తన్యము
సారస్వతాక్షర సారధ్యము.. జ్ణ్జానసామ్రాజ్యము.. జన్మసాఫల్యమూ
సారస్వతాక్షర సారధ్యము.. జ్ణ్జానసామ్రాజ్యము.. జన్మసాఫల్యమూ

సరసవక్షోభిని సారసలోచినీ వాణీపుస్తకధారినీ
వర్ణాలంకృత వైభవశాలిని వరకవితా చింతామణి
మాం పాహీ సారోగ్య సంధాయినీ
మాం పాహీ శ్రీచక్ర సింహాసినీ..

వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే.. వింధ్య విలాసిని  వారాహి త్రిపురాంబికే
భవతి విధ్యాం దేహి.. భగవతి సర్వార్ధసాధికే.. సత్యాద్రచంద్రికే

మాంపాహీ మహనీయ మంత్రాత్మికే
మాంపాహి మాతంగి మాయాత్మికే 

No comments: