పద్మనాభం యుద్ధం

పద్మనాభం యుద్ధం 

మూలము  :తెలుగువెలుగు మాస పత్రిక నుండి                                                                   సేకరణ  : facebook posts
ఎక్కడో జరిగిన తళ్ళికోట యుద్ధం గురించి తెలుగువాళ్ళందరికీ తెలుసు. మరి మన గడ్డమీద జరిగిన 
'పద్మనాభం' యుద్ధం గురించి తెలుసుకుందాం.
మన దేశం లో బ్రిటిష్ పాలన మొదలయ్యే టప్పటికి విజయనగరం గంజాం,విశాఖపట్టణం, శ్రీకాకుళం 
ప్రాంతాలు 20 మంది జమీందారుల అధీనం లో వుండేవి.వివిధ కారణాలవల్ల ఈ జమీందారులు అంగ్లేయులకు 
వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు.ఆంగ్లేయులకేమో సాధ్యమైనంత తీరప్రాంతం తమ గుప్పిట్లో వుండాలన్న
పట్టుదల.ఆ ప్రయత్నాల్లోనే విజయనగరం జమీన్దారీని ఆక్రమించు కోవాలనుకున్నారు. ఇంతలో విజయనగరం అధిపతి ఆనందగజపతిరాజు మరణించడం తో దానికి అవకాశం వచ్చింది.అప్పటికి ఆయన కొడుకు చిన విజయరామరాజుది చిన్న వయసు.అందుకని ఆనందగాజపతిరాజు సవతి సోదరుడైన
సీతారామరాజును దివానుగా నియమించారు.విజయరామరాజు రాజు కాగానే సీతారామరాజును దివాన్
పదవి నుండి తొలగించారు,దాంతో సీతారామరాజు ఆంగ్లేయులతో జట్టు కట్టాడు. అవకాశం చూసుకొని
ఆంగ్లేయులు తమకు చెల్లించాల్సిన ఎనిమిదిన్నర లక్షల పేష్కస్ చెల్లించాలని లేకపోతే జమీన్దారీని
ముట్టడిస్తామని విజయరామరాజును హెచ్చరించారు. రాజు దానికి ఒప్పుకోక పోవడం తో 1793 ఆగస్ట్ 2వ తేదీన విజయనగరం కోటను ఆక్రమించుకున్నారు.ఆగ్లేయులు రాజుకు నెలకు 1200 రూపాయలు
యిస్తామనీ,మచిలీపట్నం వెళ్లాల్సిందిగా ఆదేశించారు.తిరస్కరించిన రాజు విశాఖపట్టణం జిల్లా లోని
పద్మనాభం చేరుకున్నాడు.అక్కడ కొంత సైన్యం సమకూర్చుకొని ఆంగ్లేయుల మీద యుద్ద్ధం ప్రకటించాడు.
జులై 10 1794 నాడు జరిగిన ఆ యుద్ధం లో విజయరామరాజు మరణించాడు.విజయనగరం
ఆంగ్లేయుల చేతిలోకి వచ్చింది.చరిత్ర లో యిదే 'పద్మనాభయుద్ధం' గా ప్రసిద్ధి గాంచింది.
ఇక్కడ వున్న పద్మనాభస్వామి దేవాలయం కళింగ నిర్మాణ శైలిలో అలరారు తుంటుంది.
శ్రీకృష్ణదేవరాయలు కళింగ దండయాత్ర విజయానికి గుర్తుగా నాటించిన విజయస్తంభం వున్న పొట్నూరు ఇక్కడికి సమీపం లోనిదే.
సేకరణ:- తరంగిణి శృంగవరపుకోట .
తెలుగువెలుగు మాస పత్రిక నుండి

No comments: