ఎక్కడి మానుష జన్మం
ప|| ఎక్కడి మానుష జన్మంబెత్తిన ఫలమే మున్నది | నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికనూ ,నీ చిత్తంబికనూ ||
( ఎక్కడి )
చ|| మరువను ఆహారంబును మరువను సంసార సుఖము | మరువను యింద్రియ భోగము మాధవ నీ మాయ | మరచెద సుజ్ఞానంబును మరచెద తత్త్వ రహస్యము | మరచెద గురువును దైవము మాధవ నీ మాయ
( ఎక్కడి )
( ఎక్కడి )
|| చ|| విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు | విడువను మిక్కిలి యాసలు విష్ణుడ నీమాయ | విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును | విడిచెద నాచారంబును విష్ణుడ నీమాయ
( ఎక్కడి )
( ఎక్కడి )
|| చ|| తగిలెద బహు లంపటముల తగిలెద బహు బంధముల | తగులను మోక్షపు మార్గము తలపున యెంతైనా | అగపడి శ్రీ వేంకటేశ్వర అంతర్యామివై | నగి నగి నను నీవేలితి నాకా యీమాయ ||
( ఎక్కడి )
No comments:
Post a Comment